Haritodyamam.

image

naa talli telangaana medalo
pachhalu podigenduke ee haritodyamam….

guppuna karbanamodulutunai
ballu kaarkhaanalu,
oopuri salapaneekunnai
janaavaasala ranagonadwanulu,
veeti nadumana jikki
kaalakootam mingutunnam…

pachhani chettaite,
karbanamtaa tini, praanavaayu nistundi,
mandutendalo godugai kaastundi,
moham chaatese mabbunu-
pilichi, laalinchi – kuriselaa chestundi…

anduke pratina boonudaam,
harita haaramlo bhaagamai
mokkalni penchudaam…
bhaavitaaralanu batukanniddam,
talli telangaana medalo haritahaarameddam…

talli telangaana medalo
pachhalu podigenduku ee haritodyamam…

O chirugaali

 

Boreas
pc by Jane Dougherty

 

ఓ చిరుగాలి నా చెలికానికి ఒక్క కబురు చెప్పిరావా??
నీనాతనికై వేచున్నానని ,నాతనికై వేచున్నానని ….

ఈ విరహం ఇంకా ఎంతకాలం??
ఒపలేకున్నానని తనకొక్కసారి చెప్పిరావా,,,
ఏ దిక్కునైనా తానే కనిపిస్తున్నాడని,
ఏ పిలుపైనా తానే వినిపిస్తున్నాడని,
 ఓ చిరుగాలి నా చెలికానికి ఒక్క కబురు చెప్పిరావా??
నీనాతనికై వేచున్నానని ,నాతనికై వేచున్నానని ….
నులివెచ్చని తన కౌగిట బందీనైపోయే అందుకు
పరిమళమై తనని చుట్టేసే అందుకు
ఓ చిరుగాలి నా చెలికానికి ఒక్క కబురు చెప్పిరావా??
నీనాతనికై వేచున్నానని ,నాతనికై వేచున్నానని ….
చుక్కలతో జేరి చందమామ వెక్కిరిస్తున్నాడని
ఒంటరిగా నిలబడినందుకు గేలిచేస్తున్నాడని
కొమ్మలపై గువ్వల జంట గోముగా చూస్తోంది
తోడులేని రాచిలకలా నేనున్నానని
ఓ చిరుగాలి నా చెలికానికి ఒక్క కబురు చెప్పిరావా??
నీనాతనికై వేచున్నానని ,నాతనికై వేచున్నానని ….

Puttina roju…o gnaapakam…

Chaakani chirunavvuto
Modailana ee roju…
Navvula kilakilalato
Aanadapu kerintalato…
Kammani paatla…
Nemalamma aatala…
Saagipoindi…
O tiyyani gnaapakamai
Dinacharya pustakamloni kaagitamai
Nisheedi ollo chukkala duppatlo
Niduristooo…
Ika selvantoo…malli yedu tirigostaanantoo..
Maralipoindi…gnapakamgaa migilipoindi

Sri Sudha from wordpress.com

Megham….

కరడుగట్టిన  మేఘం
సుదూర  తీరాలకు  తరలి  పోతూంటే …
గుండెల్లోని  బాధ  కరిగి  కన్నిరైంది ….
కర్షక  లోకం  అసువులు  బాసింది ….
ధరామతల్లి  గొంతు  ఎండుకు  పోయింది …
చిరుగాలి  తెమ్మెరకు …
కరిగిన  మేఘం ,
చినుకై  నేలను  తాకగానే …
ప్రతి  పెదవిపై   చిరునవ్వుబూసింది
నేలమ్మ  గుండెల్లో  దాగిన  విత్తు
మొలకై  మొలిచింది ….
ఆల్చిప్పల  జేరి ..
ఆణిముత్యమై  మెరిసింది
వాగు  వంకలను  దాటి
ఏరుగా  మారి …
బీడును  బంగారం  జేసింది …
జీవనదిగా  మారి
వేల  జీవితాల  ఆధార  మయ్యింది …
గలగలా  పారుతూ  తానూ …
కడలి  ఒడి  చేరింది ….
భానుకిరనాలకు     ఆవిరై
వినువీధికేగింది ….
కరిగి  మరో  మేఘమై  ….
కురిసేందుకు  గగన  వీదిన పయనమయ్యింది .

————————————————–

Sri Sudha from wordpress.com