Chitaaru komma

చిటారు కొమ్మన గువ్వ ఒకటి…
చింతతో చింత చెట్టు మీద,
చిటుక్కున కటకముల చిక్కింది,
చిత్తరువై ముఖపుస్తకమెక్కింది..

PC- This bird “plain prinia” was captured on lens by my dearest friend Mrs.Syamala Rupakula,an electical engineer by qualificaton and a keen bird watcher by profession…

Rathasaptami …రథసప్తమి

రథసప్తమి…

ఆర్కపత్రంబు,బదరీ ఫలంబు కూడి చేయు మాఘ సప్తమీ స్నానంబు…ఆరోగ్యప్రదంబు,
మనసార రవిని గొలుచుటకు-
మల్లె, కనకాంబర,మరువకమ్ము కూడిన కదంబమొకటి గట్టినాను,
ఒక్కొక్కటిగా ఎంచి మంచి చేమంతులు దెచ్చినాను,
తులసి దళమ్ము త్రిలోక్యవంద్యుని తపముగొరకు గూర్చుకున్నాను,
ప్రత్యక్ష నరాయణుని పూజకై పరవన్నము జేసినాను,
చిక్కుళ్ళ రధమొకటి భానుమూర్తునకు బహుచక్కంగా జేసి-
సప్తమీ తిధి యందు..సర్వపాప హరునకు, నా శక్తికొలది సేవ జేసినాను…
ఆయురారోగ్య ఐశ్వర్యంబులనిచ్చు ఆదిత్యునికి ఆ విధిన అర్చనంబడసినాను.

Sri Sudha k

Rathasaptami …రథసప్తమి

రథసప్తమి…

ఆర్కపత్రంబు,బదరీ ఫలంబు కూడి చేయు మాఘ సప్తమీ స్నానంబు…ఆరోగ్యప్రదంబు,
మనసార రవిని గొలుచుటకు-
మల్లె, కనకాంబర,మరువకమ్ము కూడిన కదంబమొకటి గట్టినాను,
ఒక్కొక్కటిగా ఎంచి మంచి చేమంతులు దెచ్చినాను,
తులసి దళమ్ము త్రిలోక్యవంద్యుని తపముగొరకు గూర్చుకున్నాను,
ప్రత్యక్ష నరాయణుని పూజకై పరవన్నము జేసినాను,
చిక్కుళ్ళ రధమొకటి భానుమూర్తునకు బహుచక్కంగా జేసి-
సప్తమీ తిధి యందు..సర్వపాప హరునకు, నా శక్తికొలది సేవ జేసినాను…
ఆయురారోగ్య ఐశ్వర్యంబులనిచ్చు ఆదిత్యునికి ఆ విధిన అర్చనంబడసినాను.

Note: ఇత్తడి గిన్నెలోని నైవేద్యం నా చెలియ “భాను గోగినేని” ఇంటిది. …

Sri Sudha k

Andam ammaayi aitE. ..

Bindu Gopalam

సంద్రపు అంచున సొగసుకు వందనం,
సోయగపు చిరు నవ్వుకు అభివందనం,
సాగరకన్య సేద తీరినట్టు…
సూరీడు వెచ్చని చలి మంటలెట్టినట్టు…
సౌందర్యం రాసిగా పోసినట్టు,
కలువ కన్నుల చలువటద్దాలు…
లేత గులాబీ రెక్కలవోలె మెరియు పెదాలు. .
అందం అమ్మాయి ఐతే అచ్చం నీలా ఉంటుంది…
అందం అమ్మాయి ఐతే అచ్చం నీలా ఉంటుంది…

This is my dearest friend… Bindu Gopalam – ageless beauty

Avadhapuri deepaavaLi. ..

దశాబ్దాల పెనుగులాటకు,
చక్కనైన ఫలితమిది. ..
రామరాజ్యమన్న మాటకు,
నవ శకానికి నిజమైన నాంది ఇది…
అవధపురికి నేడు వచ్చె అసలైన దీపావళి. …

వాకిళ్ళను అలికినాము,
రంగు ముగ్గులేసినాము ,
పూల తోరణాలు గట్టినాము,
తీర్ధ జలములు తెచ్చినాము,
దీప మాలికలను బెట్టినాము,
రామయ్యను కొలిచేందుకు కరసేవకులమైనాము….
అవధపురికి నేడు వచ్చె అసలైన దీపావళి. ..

పంచ భూతలను వెండి ఇటుకలుగ జేసి,
యేటి లోని రొజులన్ని స్తంభాలుగ మలచి,
షోడశ ఉపచారములను మూర్తులుగ చెక్కి,
అష్టదిగ్పాలకులను మందిర భుజములుగ జేసి,
మనోవాక్కాయ కర్మలను అంతస్తులుగా పేర్చి,
రామయ్యను కొలిచేందుకు కరసేవకులమైనాము….
అవధపురికి నేడు వచ్చె అసలైన దీపావళి. ..

©️ Sri Sudha K

To you my dear, ప్రియమైన నీకు…

Translation to the above lines….

Oh dear..

You are the beat of my heart,

You are the rhythm of my inhale n exhale,

You are my driving force,

You are the light of my eyes,

You are queen of my dreams,

You are life,

You are the meaning of my words,

You are color sliding from the tip of my brush,

You are the life to each of imagination,

This letter is just to tell you,

How I LOVE YOU…

Struck in your thoughts…..


2017©Sri Sudha K

ఎంతనిఎంతని??

PHOTOPAULM. com

తేనియలు గ్రోలుతున్న తుమ్మెదని అడగనా,

ఆ పూల మకరందపు మత్తుఎంతని??

మధు రాగమాలపించే కోయిలమ్మనడగనా,

అలమావిచిగురు మత్తుఎంతని??

చందమామకై కాచుకున్న చకోరాన్ని అడగనా,

వెన్నెల వెచ్చనిదనమెంతని??

తుషారబిందువుని అడగనా,

భానుకిరణాల వెచ్చనిదనమెంతని??

ఇవిగాక నిన్ను నీనడగనా…

నాపై నీకున్న ప్రేమ ఎంతని??

——–

2017©Sri Sudha K