ఎంతనిఎంతని??

PHOTOPAULM. com

తేనియలు గ్రోలుతున్న తుమ్మెదని అడగనా,

ఆ పూల మకరందపు మత్తుఎంతని??

మధు రాగమాలపించే కోయిలమ్మనడగనా,

అలమావిచిగురు మత్తుఎంతని??

చందమామకై కాచుకున్న చకోరాన్ని అడగనా,

వెన్నెల వెచ్చనిదనమెంతని??

తుషారబిందువుని అడగనా,

భానుకిరణాల వెచ్చనిదనమెంతని??

ఇవిగాక నిన్ను నీనడగనా…

నాపై నీకున్న ప్రేమ ఎంతని??

——–

2017©Sri Sudha K

నీకై….

మంచు కురిసే వేళలో…

మది మురిసిపోయింది…

నీ తలపుల జడివానలో,

తడిసి పులకించింది…

నీ రాకకై నిరీక్షణలో,

పూలదారై నిలిచింది….

నిను జేరి మురిసేందుకు,

ఉరుకులపరుగుల బయలుదేరింది…