
రథసప్తమి…
ఆర్కపత్రంబు,బదరీ ఫలంబు కూడి చేయు మాఘ సప్తమీ స్నానంబు…ఆరోగ్యప్రదంబు,
మనసార రవిని గొలుచుటకు-
మల్లె, కనకాంబర,మరువకమ్ము కూడిన కదంబమొకటి గట్టినాను,
ఒక్కొక్కటిగా ఎంచి మంచి చేమంతులు దెచ్చినాను,
తులసి దళమ్ము త్రిలోక్యవంద్యుని తపముగొరకు గూర్చుకున్నాను,
ప్రత్యక్ష నరాయణుని పూజకై పరవన్నము జేసినాను,
చిక్కుళ్ళ రధమొకటి భానుమూర్తునకు బహుచక్కంగా జేసి-
సప్తమీ తిధి యందు..సర్వపాప హరునకు, నా శక్తికొలది సేవ జేసినాను…
ఆయురారోగ్య ఐశ్వర్యంబులనిచ్చు ఆదిత్యునికి ఆ విధిన అర్చనంబడసినాను.
Note: ఇత్తడి గిన్నెలోని నైవేద్యం నా చెలియ “భాను గోగినేని” ఇంటిది. …
Sri Sudha k